Harish Rao Fired on CM Revanth : బడా బాబుల కోసం పేద‌ల బ‌తుకులు కూలుస్తారా..?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Harish Rao : హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పాల‌న గ‌తి త‌ప్పింద‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం రాష్ట్రానికి శాపంగా మారింద‌న్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌షాకోట్‌లో హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో దీపావళి పండుగ జరుపుకున్నారు. పేదల ఇల్లు కూల్చడం ఆగాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనకి నయా నరకాసురుడు వచ్చాడు రేవంత్ రెడ్డి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు హ‌రీశ్ రావు. నరకాసురుని పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి వ‌స్తుంద‌న్నారు.

MLA Harish Rao Slams CM Revanth Reddy

కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం కంటికి కునుకు లేకుండా చేస్తోంద‌ని వాపోయారు త‌న్నీరు హ‌రీశ్ రావు. బడా పారిశ్రామికవేత్తల కోసం పేదల బతుకులు కూలుస్తారా అని నిల‌దీశారు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడని మండిప‌డ్డారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ త‌ను రాజు లాగా ఫీల్ అవుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు. హైడ్రాలో పొంగులేటి ఇల్లు కనిపించడం లేదా? రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు కనిపించడం లేదా? పేదోళ్ల ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా అని నిల‌దీశారు. నది పేరేమో మూసీ, పెద్దోళ్ళకేమో ఖుషి, పేదల బతుకులు ఏమో మసి.. ఇదే రేవంత్ రెడ్డి కసి అంటూ ఫైర్ అయ్యారు.

Also Read : Nara Lokesh-AP Growth : ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నాన్ని తీర్చి దిద్దుతాం

Exit mobile version