KTR : హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అవినీతి, అక్రమాలకు అడ్డాగా సర్కార్ మారిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సోయి లేని సీఎం కారణంగా రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ లో హైడ్రాను అడ్డం పెట్టుకుని చెలరేగి పోతున్నారని, వసూళ్ల దందాలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్ (KTR). ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
KTR Shocking Comments on Hydraa
ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందన్నారు. అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందోని వాపోయారు కేటీఆర్ . కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొంద పెట్టాలన్నారు. గణేశ్ నిమజ్జనానికి ట్యాంకుబండ్‌కు వెళ్లిన రేవంత్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించు కోలేదన్నారు. ప్రభుత్వంతో ప్రజలు డిస్‌కనెక్ట్ అయ్యారనడానికి అదే నిదర్శనం అన్నారు. అదే సమయంలో కేసీఆర్‌కు మద్దతుగా ‘కారు గుర్తుకు ఓటేస్తా.. చల్ దేక్‌లేంగే..’ పాట ట్యాంకుబండ్‌పై మార్మోగడంతో మళ్లీ కేసీఆర్ రావడం పక్కా అని తేలి పోయిందన్నారు.
Also Read : Ex Minister Jagadish Reddy Fired on CM : రేవంత్ రెడ్డి అరాచక పాలన సాగదు
