Jagadish Reddy : హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నాడని, ఆయనకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy). గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంప పెట్టు అన్నారు. అయినా సర్కార్ కు సోయి రావడం లేదన్నారు. వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరో, ఎవరు పోస్టులను అమ్ముకున్నారో బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన చెందారు మాజీ మంత్రి.
Ex Minister Jagadish Reddy Slams CM Revanth Reddy
గ్రూప్ – 1 లో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలు, అవినీతిని హైకోర్టు బయట పెట్టిన వెంటనే కేవలం డైవర్షన్ కోసమే మల్లొకసారి ఫార్ములా ఈ కేసును తెరపైకి రేవంత్ రెడ్డి తీసుకు వచ్చాడని మండిపడ్డారు. నువ్వు మీడియాలో స్పేస్ ఆక్యుపై తప్ప ప్రజల మనసుల్లో స్పేస్ ఆక్యుపై చేయలేవన్నారు. ఇదొక లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఆనాడే చెప్పాడన్నారు. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల నీ అరాచక పాలనపై వంద కేసులు పెట్టి నిన్ను జైల్లో పెట్టాలన్నారు జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో యువత ఎంత కోపంగా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. అయినా బుద్ది రావడం లేదన్నారు. ఓ వైపు యూరియా అందక అల్లాడుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
Also Read : IND vs UAE – India Victory : కుల్దీప్ యాదవ్ కమాల్ యుఎఇ ఢమాల్
