గౌత‌మ్ గంభీర్ పై భ‌గ్గుమ‌న్న ఇర్ఫాన్ ప‌ఠాన్

శుభ్ మ‌న్ గిల్ ను కొన‌సాగించ‌డం దారుణం

hellotelugu-IrfanPathan

ఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఎక్స్ సామాజిక మాధ్య‌మం వేదిక‌గా స్పందించారు. తాజాగా దక్షిణాఫ్రికా జ‌ట్టుతో టి20 సీరీస్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి దాకా రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. తొలి టి20 మ్యాచ్ క‌ట‌క్ లో జ‌ర‌గ‌గా భార‌త జ‌ట్టు గెలిచింది. ఇక ముల్లాన్ పూర్ వేదిక‌గా జ‌రిగిన 2వ టి20 మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు దుమ్ము రేపింది. టీమిండియాను 51 ప‌రుగుల‌తో చిత్తుగా ఓడించింది. తిల‌క్ వ‌ర్మ ఒక్క‌డే రాణించాడు. మిగతా వారు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేదు. ప్ర‌ధానంగా ఓపెన‌ర్ గా గ‌త కొంత కాలంగా ఆడుతూ వ‌స్తున్న శుభ్ మ‌న్ గిల్ కంటిన్యూగా విఫ‌లం అవుతూ వ‌స్తున్నాడు. దీంతో పెద్ద ఎత్తున నిర‌స‌న , ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

ఈ సంద‌ర్బంగా దేశీవాలి క్రికెట్ టోర్నీలో అద్భుతంగా రాణించినా ఎందుక‌ని సంజూ శాంస‌న్ , రింకూ సింగ్ ల‌ను ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదంటూ భ‌గ్గుమ‌న్నారు మాజీ క్రికెట‌ర్లు సైతం. ప్ర‌ధానంగా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ క్రికెట‌ర్, బౌల‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్. సంజు సామ్సన్ ఒక సంవత్సరంలో 3 సెంచరీలు కొట్టాడు, కానీ శుభ్‌మాన్ గిల్‌కు సరిపోయేలా 5వ స్థానానికి నెట్టబడ్డాడు. ఇప్పుడు, ప్రదర్శన ఇచ్చినప్పటికీ, అతను T20 జట్టు నుండి కూడా తొలగించబడ‌డం దారుణ‌మ‌న్నారు ఇర్ఫాన్ ప‌ఠాన్. ఇక‌నైనా శాంస‌న్ ను ఎందుకు ప‌క్క‌న పెట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇది ప్ర‌తిభ‌ను తొక్కి పెట్ట‌డం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

Exit mobile version