అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం అనేది ప్రధాన ప్రతిబంధకంగా మారిందని అన్నారు. ప్రజలపై కూడా అవగాహన కల్పంచాలని సూచించారు. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నత అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని స్పష్టం చేశారు. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇందు కోసం టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు కూడా చేశారు సీఎం. కాలుష్యం అనేది అభివృద్దికి ప్రతిబంధకంగా మారిందని, దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. సంబంధిత శాఖాధికారులపై కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. కాలుష్య నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.















