అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా భారీ ఎత్తున ఇప్పటికే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతంలో రూ. 9 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి విశాఖ ఆర్థిక జోన్ కింద అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ‘బే సిటీ’ ప్రాజెక్ట్‌ను ప్రధాన కేంద్రంగా (యాంకర్ ప్రాజెక్ట్‌గా) చేసుకుని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
భారీ ఎత్తున కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్ల నుండి రూ. 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని, అలాగే ప్రైవేట్ రంగం నుండి రూ. 5.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని యోచిస్తోందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వివిధ రంగాల్లోని కీలక ప్రాజెక్టుల ద్వారా విశాఖ ఆర్థిక జోన్ ప్రాజెక్ట్ మొత్తం రూ. 9.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్ల నుండి రూ. 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుండగా, ప్రైవేట్ రంగం నుండి రూ. 5.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుందని పేర్కొన్నారు.
సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా మొత్తం విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని నాయుడు అన్నారు. ఈ అభివృద్ధి ప్రణాళికలో ఏఐ డేటా సెంటర్ వ్యవస్థ, ఓడరేవు సంబంధిత పరిశ్రమలు, పర్యాటకం, అలాగే హైడ్రోజన్, క్లీన్-టెక్ , ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించారు. అలాగే అవసరమైన చోట నిధుల అనుసంధానంతో పాటు ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్స ను వినియోగించు కోవాలని ఆయన ఆదేశించారు.
















