చదువులపైనే దృష్టి పెట్టండి ఆందోళనలపై కాదు

విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాలకు సూచన

hellotelugu-AIU

న్యూఢిల్లీ : సుదీర్ఘ ఆందోళనలు విద్యార్థుల విద్యా పురోగతికి భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని ఏఐయు పేర్కొంది. నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనకు మద్దతుగ, జూలై 22, 2026న ముంబైలో జరిగిన నిరసన సమావేశంలో ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యార్థులకు చదువుల పైనే దృష్టి సారించేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని, అలాగే ఇటీవలి పరీక్షల వివాదాలకు సంబంధించిన నిరసనల్లో పాల్గొనకుండా వారిని నిరుత్సాహపరచాలని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కోరింది. సుదీర్ఘ ఆందోళనలు విద్యార్థుల విద్యా పురోగతికి భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని ఏఐయూ స్ప‌ష్టం చేసింది. సభ్య సంస్థల వైస్-ఛాన్సలర్లు , డైరెక్టర్లకు రాసిన లేఖలో ఏఐయు అధ్యక్షుడు వినయ్ కుమార్ పాఠక్ విశ్వ విద్యాలయాల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.

విద్యార్థులతో సానుభూతితో వ్యవహరించాలని, అదే సమయంలో వారిని తమ విద్యా లక్ష్యాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని కోరారు. నిరసన పిలుపుల వల్ల వారి శక్తి వృథా కాకుండా చూసుకోవాలని” సూచించారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించేలా ప్రోత్సహించడం , పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియపై విశ్వాసం ఉంచేలా చూడటం అనే అంశంతో కూడిన ఈ లేఖలో, విద్యార్థుల ఆందోళనలు ముఖ్యమైనవని, వాటిని సానుభూతి , గౌరవంతో వినాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. అయితే సుదీర్ఘ ఆందోళనల వల్ల విద్యార్థులే అత్యధిక మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనివల్ల విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగడం, పరీక్షల సన్నద్ధతలో ఏకాగ్రత దెబ్బతినడం, అనవసరమైన ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. నీట్ 2026 పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సూచన చేశారు.

Exit mobile version