గ్యాస్ డెలివ‌రీ కాక‌పోతే ఫిర్యాదు చేయండి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

hellotelugu-LPGGasCylender

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ, బీజేపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. యుద్దం నేప‌థ్యంలో గ్యాస్ స‌ర‌ఫ‌రా కు సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌పై ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. ఇప్ప‌టికే ఆయా ఆయిల్ కంపెనీలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపింది స‌ర్కార్. కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని వెల్ల‌డించింది.

ఒక‌వేళ ఎవ‌రైతే బుక్ చేసుకున్నా గ్యాస్ అంద‌క‌పోతే త‌క్ష‌ణ‌మే ఆయా కంపెనీల‌కు సంబంధించి ఫోన్ నెంబ‌ర్ల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించింది. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 కు చేయాల‌ని పేర్కొంది. ఇక భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345 అనే నెంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల‌ని సూచించింది కేంద్రం. HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల‌ని వెల్ల‌డించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో స‌రిప‌డా గ్యాస్ నిల‌వ‌లు ఉన్నాయ‌ని, ఫేక్ ప్ర‌చారాన్ని గ్యాస్ వినియోగ‌దారులు న‌మ్మ వ‌ద్ద‌ని కోరింది మోదీ ప్ర‌భుత్వం.

Exit mobile version