ఢిల్లీ : కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. పేదలు, అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేందు కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేసింది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సేవా తీర్థంలో పేదలు, అణగారిన వర్గాల, కష్టపడి పనిచేసే రైతుల సాధికారత, యువ శక్తి, నారీ శక్తికి సంబంధించిన ఫైళ్లపై సంతకం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రమాదాల బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభించే PM RAHAT పథకాన్ని ప్రారంభించడానికి ఆమోదం లభించింది. దీని ద్వారా ప్రభావితమైన ఎవరికైనా తక్షణ వైద్య సహాయం అందించడం జరుగుతుంది.
లఖ్పతి దీదీ పథకం లక్ష్యాన్ని 6 కోట్లకు రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇది మహిళా సాధికారత,స్వావలంబనను పెంచుతుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష్యాన్ని రూ. 1 లక్ష కోట్ల నుండి రూ. 2 లక్షల కోట్లకు రెట్టింపు చేశారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఆదాయాలను పెంచడంలో సహాయ పడుతుంది. రూ. 10,000 కోట్ల కార్పస్‌తో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి ఆమోదం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను, లోతైన సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహిస్తుంది.
