Kurnool : కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో పూర్తిగా కాలి బూడిదై పోయింది వోల్వో బస్సు. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా చోటు చేసుకుంది.
Kurnool Volvo Bus Accident
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు (Kurnool) ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా కావేరి వోల్వో బస్సు దగ్ధం ఘటనపై వెంటనే స్పందించారు మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Also Read : MLA Kolikapudi Shocking Comments : టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ. 5 కోట్లు డిమాండ్
