Farooq Abdullah Shocking Comments : ల‌డ‌ఖ్ తో కేంద్రం చ‌ర్చ‌లు జ‌ర‌పాలి : అబ్దుల్లా

ఇప్ప‌టికే న‌లుగురు మృతి చెందార‌ని ఆవేద‌న

Hello Telugu - Farooq Abdullah Shocking Comments

Hello Telugu - Farooq Abdullah Shocking Comments

Farooq Abdullah : జ‌మ్మూ కాశ్మీర్ : నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా (Farooq Abdullah) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ల‌డ‌ఖ్ ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంద‌ని, ఇప్ప‌టికే అల్ల‌ర్ల‌తో స‌త‌మ‌తం అవుతోందంటూ ఆవేద‌న చెందారు. గురువారం ఫ‌రూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర హోదా కోసం గ‌త కొంత కాలంగా ల‌డ‌ఖ్ వాసులు పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు. అయినా బ‌ల‌వంతంగా అణిచి వేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య పెరుగుతుందే త‌ప్పా ప‌రిష్కారం కాద‌న్నారు అబ్దుల్లా. వెంట‌నే కేంద్రం రంగంలోకి దిగాల‌ని, ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైన నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆ దిశ‌గా శాంతి నెల‌కొనేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు . లేహ్‌లో హింసాత్మక నిరసనల మ‌ధ్య‌ నలుగురు మరణించారని, 80 మంది గాయపడ్డారని వాపోయారు ఫ‌రూఖ్ అబ్దుల్లా.

Farooq Abdullah Key Comments on Ladakh

కేంద్రం లడఖ్ ప్రజలతో చర్చలు జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మ‌రోసారి కోరారు. ఇది (లడఖ్) సరిహద్దు రాష్ట్రం అని నేను ప్రభుత్వానికి చెప్పాలని అనుకుంటున్నాను. దీని వెనుక చైనా హ‌స్తం ఉంద‌న్నారు. వారు భూమిని ఆక్రమించారు. దానిని త్వరగా పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని స్ప‌ష్టం చేశారు ఫ‌రూక్ అబ్దుల్లా. హింసకు వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం నిందించడం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వాంగ్ చుక్ గాంధీ మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్ట లేద‌న్నారు. యువత ఇవాళ‌ అతన్ని పక్కన పెట్టారు. దానికి అతను బాధ్యత వహించడని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఓడి పోయినప్పుడు, వారు భద్రతా చట్టాన్ని విధించి ప్రజలను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు వారు సిబిఐని ఉపయోగిస్తున్నార‌ని ఆరోపించారు.

Also Read : Stock Market Shocking : 4వ రోజు కూడా నష్టాల్లో నడిచిన స్టాక్ మార్కెట్

Exit mobile version