చిరు ధాన్యాలు సాగుపై రైతులు దృష్టి సారించాలి

వీబీ జీ రామ్ జీ తో ఉపాధి, మౌలిక సదుపాయల కల్పన

hellotelugu-SSavitha

శ్రీసత్యసాయి జిల్లా : కరోనా కంటే ప్రమాదకమైన ఎల్ నినో వర్షాభావ పరిస్థితులను వీబీ జీ రామ్ జీ పథకంతో ధీటుగా ఎదుర్కొందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత దిశా నిర్దేశం చేశారు. రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి ఆధారమైన పంటలకు బదులు చిరుధాన్యాల సాగును రైతులు చేపట్టాలని సూచించారు. జల జీవన్ మిషన్ కింద రూ.11.50 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో తాగునీటి కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ నినోను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎల్ నినోపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఎల్ నినో – వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంపై వ్యవసాయ, రెవెన్యూ, హార్టీకల్చర్, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎల్ నినో కారణంగా 140 దేశాల్లో కరవు ప్రబలే ప్రమాదముందని త. భార స‌విత హెచ్చ‌రించారు. దేశం విషయానికొస్తే దక్షిణ‌ భారతంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు హెచ్చరించార‌ని పేర్కొన్నారు. అందులోనూ ఉమ్మడి అనంతపురంలో కరువు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందన్నారు స‌విత‌. సాగు, తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫామ్ పాండ్స్(పొలం కుంటలు) నిర్మాణానికి హార్టీకల్చర్ ద్వారా 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రతి వర్షపు నీటితో పాటు వృథాగా పోయే నీటిని ఈ కుంటల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెంచడంతో పాటు సాగు నీటిని సంరక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఒక్కో ఫాం పాండ్ నిర్మాణానికి రూ.1.80 లక్షలు వ్యయం కాగా, ప్రభుత్వం రూ.90 వేలు రాయితీ అందిస్తుందని సవిత తెలిపారు.

Exit mobile version