Ex MP Anjani Kumar Interesting Comments : జూబ్లీహిల్స్ లో బ‌రాబ‌ర్ నిల‌బ‌డ‌తా

మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్

Hello Telugu - Ex MP Anjani Kumar Interesting Comments

Hello Telugu - Ex MP Anjani Kumar Interesting Comments

Anjani Kumar : హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపాడు మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ (Anjani Kumar). తాను త‌ప్ప‌కుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌న్నారు. శ‌నివారం టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ , రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ త‌న వ‌ద్ద‌కు స్వ‌యంగా వెళ్లారు. త‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. త‌న‌ను కాకుండా నవీన్ యాద‌వ్ కు ఎలా అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ వస్తామ‌న్నారు అంజ‌న్ కుమార్ యాద‌వ్.

Ex MP Anjani Kumar Yadav Comments

మల్కాజ్‌గిరి, కామారెడ్డి లో పోటీ చేసినప్పుడు లోకల్ నాన్ లోకల్ గుర్తుకు రాలేదా అని భ‌గ్గుమ‌న్నారు. ఈసంద‌ర్బంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రమే లోకల్, నాన్ లోకల్ సమస్య ఎందుకు వచ్చిందంటూ ప్ర‌శ్నించారు. నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ న‌ని, తాను ఎక్క‌డైనా ఎప్పుడైనా పోటీ చేసే అధికారం, హ‌క్కు త‌న‌కు ఉంద‌న్నాడు అంజ‌న్ కుమార్ యాద‌వ్. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, పార్టీ కోసం పని చేసింది నేన‌ని అన్నారు. త‌న‌కు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో బ‌య‌ట పెడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చారు . కనీసం జూబ్లీహిల్స్ కమిటీలో కూడా నన్ను తీసుకోలేదు ఎందుక‌ని మండిప‌డ్డారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు నన్ను సంప్రదించారా అని నిల‌దీవారు.

Also Read : Hydraa Shocking Decision : బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

Exit mobile version