KTR Fired on Congress Govt : హామీల జాత‌ర అమ‌లులో పాత‌ర : కేటీఆర్

రాష్ట్రంలో అహ నా పెళ్లంట సినిమా న‌డుస్తోంది

hellotelugu-ktr

KTR : హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బుధ‌వారం తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్ర‌సంగించారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో అహనా పెళ్లంట సినిమా నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఆ సినిమా తరహాలోనే కోడిని చూపించి అదే చికెన్‌ బిర్యాని అంటూ న‌మ్మించి మోసం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. కావాల‌ని స‌న్మానం చేయించు కోవ‌డం, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత వ‌చ్చిన వారితో తిట్లు తిన‌డం సీఎం రేవంత్ రెడ్డికి అల‌వాటుగా మారింద‌న్నారు కేటీఆర్. ఇక‌నైనా ఈ విష‌యం తెలుసుకుని న‌డుచుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఎన్ని హామీలు ఇచ్చినా, ఇంకెంత‌గా జిమ్మిక్కులు ప్ర‌యోగించినా గెల‌వ‌డం అసాధ్య‌మ‌న్నారు.

KTR Slams Congress Govt

నేను చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటా అని నేనేమి చెప్పట్లేదు అని ఆ మీటింగ్‌ చివర్లో రేవంత్‌ రెడ్డే చెప్పేశారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్‌కు ఓటేయాలనే ఉత్సాహం ఎవ్వరిలోనూ కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదన్నారు. బోనస్‌ లేదు, పెట్టుబడి సాయం లేదు, విత్తనాలు లేవు, ఎరువులు అస‌లే లేవ‌న్నారు. ఎరువుల కోసం లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన పరిస్థితి కూడా చూశామ‌న్నారు. కానీ సోయి ఉన్న‌ట్టు క‌నిపించ లేద‌న్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా మోసం చేసిన ఘ‌న‌త ఈ సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. మంత్రులు అబద్ధాలు చెబితే కనీసం అతికేటట్లు కూడా లేవన్నారు కేటీఆర్.

Also Read : Trump Important Comments on Modi : ప్ర‌ధాని మోదీ అద్భుత‌మైన వ్య‌క్తి : ట్రంప్

Exit mobile version