Trump : అమెరికా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump). మోడీ అత్యంత అందమైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. భారత్ తో ఆయన త్వరలో మరికొన్ని వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయనను ప్రశంసించినట్లు అంచనా. ఇదే సమయంలో మరోసారి ట్రంప్ నోరు పారేసుకున్నారు. యధావిధిగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్దం చోటు చేసుకోకుండా తాను జోక్యం చేసుకున్నానని చెప్పారు. లేకపోతే భారీ యుద్దం కొనసాగి ఉండేదన్నారు ట్రంప్. దక్షిణ కొరియాలోని జియోంగ్జులో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సీఈఓ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు.
Donald Trump Praises PM Modi
మోదీని ఉద్దేశించి అందమైన వ్యక్తి, తండ్రి అంటూనే హంతకుడు, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అమెరికా చీఫ్. అదే సమయంలో రెండు దేశాల మధ్య త్వరలో జరగనున్న వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. తన జోక్యం కారణంగానే అణు యుద్దం జరగకుండా నివారించడం జరిగిందన్నారు ట్రంప్. తాను వ్యక్తిగతంగా ప్రధాని మోడీని, పాకిస్తాన్ నాయకత్వాన్ని సంప్రదించానని, సంయమనం పాటించాలని కోరానని చెప్పారు. తామిద్దరి మధ్య స్నేహం కంటే గొప్పనైన బంధం ఉందన్నారు. అంతే కాదు పాకిస్తాన్ ప్రధాని కూడా గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆయన గొప్ప పోరాట యోధుడంటూ కితాబు ఇచ్చారు.
Also Read : BRS Party Road Show Sensational : 31 నుండి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ రోడ్ షోలు
