Jogi Ramesh : అమరావతి : మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వైయస్సార్‌సీపీ నేతలు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్‌బాబు. జోగి రమేష్ (Jogi Ramesh) అరెస్ట్ పూర్తిగా అక్రమమని, ఇది కేవలం కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కావాలని కల్తీ మద్యం కేసులో జోగిరమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారని ఆరోపించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న జనార్థన్‌రావుతో జోగి రమేష్ కు సంబంధం ఉందంటూ ఒత్తిళ్లకు గురి చేసి చెప్పించారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు మాజీ మంత్రులు.
Ex Minister Jogi Ramesh Arrest
జోగి రమేష్ ను, ఆయన కుటుంబాన్ని దురుద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేయడమే ఏపీ కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారని ఫైర్ అయ్యారు. కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికి పోవడంతో, ఆ బురదను వైయస్సార్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే తనకు లిక్కర్ తయారీతో సంబంధం లేదని జోగి రమేష్ చెప్పారన్నారు. ఇందుకు తానే స్వయంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని కోరారని అన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఎందుకు విచారణ చేయమని కోరుతారని ప్రశ్నించారు మాజీ మంత్రులు.
Also Read : MP Eatala Rajender Clear Update : చేపల పెంపకం కోట్లాది మందికి ఆధారం
