Ex Minister Jagadish Reddy Fired on BJP : ప్రాణం పోయినా స‌రే బీజేపీతో పొత్తు ఉండ‌దు

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

Hello Telugu - Ex Minister Jagadish Reddy Fired on BJP

Hello Telugu - Ex Minister Jagadish Reddy Fired on BJP

Jagadish Reddy  : హైద‌రాబాద్ – మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ చేసిన కామెంట్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యాంకుల‌కు శ‌ఠ‌గోపం పెట్టి మోసాల‌కు పాల్ప‌డిన చ‌రిత్ర ఉన్న త‌న‌కు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. ఆదివారం జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy) మీడియాతో మాట్లాడారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆరోజే చెప్పార‌ని మ‌రోసారి గుర్తు చేశారు. ఈరోజుకి కూడా అదే మాట మీద ఉన్నామ‌న్నారు. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Ex Minister Jagadish Reddy Shocking Comments

ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్దాలేనంటూ వీడియోలు చూపించారు జ‌గ‌దీశ్ రెడ్డి. నీ మాటలు వింటే జైపాల్ రెడ్డి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునేదన్నారు. ఎందుకంటే.. జైపాల్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేద‌న్నారు, ఉద్యమం గురించి మాట్లాడ లేద‌ని ఈ విష‌యం ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు. ఆ విషయం గురించి నువ్వే గ‌తంలో చెప్పింది మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి.

జైపాల్ రెడ్డి బతికి ఉన్నపుడు నిన్ను మనిషి కింద కూడా చూడ లేద‌న్నారు. గొంగళి పురుగు కంటే అధ్వాన్నంగా చూశాడ‌ని, నీ గురించి మాట్లాడానికి కూడా ఇష్ట పడలేదన్నారు. నువ్వు జైలుకి పోయినపుడు నీ గురించి మాట్లాడమని ఎంతోమంది అడిగినా ఆయ‌న ఒప్పు కోలేద‌న్నారు. నీకు స్పీచులు రాసిచ్చే పీఆర్వోకు నీ మీద కోపం ఉన్నట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ రాలేనంటూ లేఖ రాస్తే అది నీకు అవార్డు ఇచ్చిన‌ట్టేనంటూ రాసి ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. నిన్ను సీఎం అని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉంద‌న్నారు జ‌గ‌దీశ్ రెడ్డి.

Also Read : KTR Sensational Announcement : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు టికెట్లు

Exit mobile version