Europe Sanctions – Russia Shocking : రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్

ఈ నిర్ణయం వల్ల రష్యాకు వచ్చే ఆదాయాన్ని నియంత్రించాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది...

Hello Telugu - Europe Sanctions - Russia Shocking

Hello Telugu - Europe Sanctions - Russia Shocking

Russia : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ఆ దేశంపై ఆర్థికంగా మరింత ఒత్తిడి తేవడానికి బ్రిటన్‌, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ఎగుమతి చేసే క్రూడ్‌ ఆయిల్‌ (బ్యారల్ చమురు)పై గరిష్ఠ ధరను ప్రస్తుత $60 నుంచి $45 డాలర్లకు తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి. ఈ నిర్ణయం వల్ల రష్యాకు వచ్చే ఆదాయాన్ని నియంత్రించాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

Europe Sanctions on Russia

ఈయూ, బ్రిటన్ స్పష్టం చేసిన ప్రకారం — ఎవరైనా దేశాలు రష్యా (Russia) చమురుకు నిర్ణీత గరిష్ఠ ధర కన్నా ఎక్కువ చెల్లిస్తే, ఆ దేశాలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీనితో పాటు, రష్యా చమురుతో తయారు చేసే పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తుల దిగుమతులపైనా నిషేధం విధించాయి. ఈ నిర్ణయాలతో భారత్‌లో రష్యా చమురు సంస్థ రోస్‌నెఫ్ట్ భాగస్వామ్య సంస్థ అయిన నయారా ఎనర్జీ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకా, రష్యా బ్యాంకింగ్ వ్యవస్థపైనా కొత్త ఆంక్షలు విధించిన ఈయూ, బ్రిటన్ దేశాలు, రష్యా ఫైనాన్షియల్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించనున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి.

అయితే, ఈ ఆంక్షలు తమపై పెద్దగా ప్రభావం చూపవని, తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని రష్యా ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ చర్యలు పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ తాజా పరిణామాలు రష్యా చమురు ఎగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Also Read : Gold Price Sensational : చూస్తుండగానే లక్ష దాటిన బంగారం ధర

Exit mobile version