అమరావతి : కేంద్రం తీపి కబురు చెప్పింది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-2027లో మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా ఉంది. రాష్ట్రానికి సంబంధించి మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయి. హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయి.డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ కూడా ఉంది. అత్యంత విలువైన భార ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించనుంది. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ కు రూ.40 వేల కోట్లు పెట్టారు. టెక్స్ టైల్ సెక్టార్ కు కూడా ఊతమిచ్చారు. రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు కేంద్ర బడ్జెట్ లో. దీని కారణంగా రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారని తెలిపారు.భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుందన్నారు. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయన్నారు . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని చెప్పారు. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్ర బడ్జెట్టులో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు.

















