సీఎం విజ‌య్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై ఈపీఎస్ కామెంట్స్

ఓ వైపు రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటే ప‌ర్య‌ట‌న‌లా

hellotelugu-PalaniSwamy

చెన్నై : టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె. పళనిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతసారి తమ పార్టీ గెలిచిన మదురాంతకం, ధారపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని తిరుచ్చిలో ఈపీఎస్ మీడియాతో అన్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ లండన్ పర్యటనను ఉప‌యోగించు కుంటున్నార‌ని ఆరోపించారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కరిని కూడా ఆకర్షించలేక పోయినట్లు కనిపిస్తోందని అన్నారు. నేను వార్తాపత్రికలలో ఫోటోలు చూశాను, కానీ అందులో ఒక్క పారిశ్రామికవేత్త కూడా లేరు అని ఆయన చమత్కరించారు. గతసారి తమ పార్టీ గెలిచిన మదురాంతకం, ధారపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని మ‌రోసారి ధీమా వ్య‌క్తం చేశారు.

టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన అన్నారు. తిరునెల్వేలి జిల్లాలో తీవ్ర విద్యుత్ కోతలు ఏర్పడటంతో, వీధుల్లోకి కొవ్వొత్తులతో నిరసనలు చేపట్టారని తెలిపారు. ఈ సమస్యపై తాము ఇప్పటికే ప్రకటనలు జారీ చేశామని, శాసనసభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తామని, కానీ ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని మండిప‌డ్డారు. తమిళనాడుపై రూ.10 లక్షల కోట్ల రుణ భారం ఉందని టీవీకే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం జారీ చేసిందని, అయినప్పటికీ వారు రూ.1,200 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ సముదాయాన్ని ప్రతిపాదించారని ఆయన మండిప‌డ్డారు. మనకు కొత్త సచివాలయం ఎందుకు అవసరం? ప్రస్తుతమున్నది చాలు అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version