కేరళ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు ఝలక్ ఇచ్చింది. ఇందులో భాగంగా మసాలా బాండ్ కేసులో తనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫెమా దర్యాప్తు ముగిసిన తర్వాత చర్యలకు సిఫారసు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి సీఎం విజయన్ తో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇషాక్ , సీఎం ప్రధాన కారయదర్శి కేఎం అబ్రహంలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.466 కోట్ల ఫెమా షోకాజ్ నోటీసు జారీ చేసిందని అధికారికంగా వెల్లడించారు సంబంధిత అధికారులు. వ్యక్తిగత హాజరు అవసరం లేని ఈ నోటీసును విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ప్రకారం ఫెడరల్ దర్యాప్తు సంస్థ గత 10 రోజుల కిందట జారీ చేసింద.ఇ
ఫెమ దర్యాప్తు ముగిసిన తర్వాత షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు సమాచారం. మసాలా బాండ్ల ద్వారా కేఐఐఎఫ్‌బీ సేకరించిన రూ. 2,000 కోట్ల వినియోగించడంపై ఆరా తీసింది ఈడీ. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ అనేది కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సంస్థ.రాష్ట్రంలోని కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రూ. 50,000 కోట్లను సమీకరించే ప్రణాళికలో భాగంగా 2019లో తన తొలి మసాలా బాండ్ జారీ ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించింది. ఇందులో రూ. 400 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ సీఎం విజయన్ జేబులోకి వెళ్లినట్లు విమర్శలున్నాయి.
