Chinta Mohan Sensational Comments : బీజేపీ పాల‌న‌లో అంతులేని అవినీతి – చింతా మోహ‌న్

అక్ర‌మాలు మ‌రింత పెరిగాయంటూ ఆరోప‌ణ‌

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Chinta Mohan : విజ‌య‌వాడ – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan) నిప్పులు చెరిగారు. బిజెపి నాయకులు వేల కోట్ల రూపాయలు తింటున్నారని ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు.
లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు అప్పులను మాఫీ చేసి, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. 100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలంటే, 10 కోట్ల రూపాయలు ముడుపులు ముట్ట చెప్పాల్సిందేన‌ని అన్నారు. బిజెపి పాలనలో అవినీతి పదింతలు పెరిగిందని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.

Ex Union Minister Chinta Mohan Sensational Comments

తాను రెండు రోజుల పాటు దేశ రాజ‌ధాని వీధుల్లో తిరిగాన‌ని, ఈ విష‌యం తాను స్వ‌యంగా తెలుసుకున్నాన‌ని చెప్పారు చింతా మొహ‌న్. NPA అసెట్స్, బిజెపి నాయకులకు కోట్ల రూపాయలు ఆదాయ వనరుగా మారిందన్నారు. తెలుగు బాగా తెలిసిన ఓ నిర్మలమ్మా… నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానంటూ కేంద్ర మంత్రిపై భ‌గ్గుమ‌న్నారు. 100 కోట్లు రూపాయలు పైబడి, దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత NPAలు అయ్యాయి? ఆంధ్రప్రదేశ్ లో ఎంత? తెలంగాణలో ఎంత? కర్ణాటకలో ఎంత? తమిళనాడులో ఎంత? లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

క్రూడాయిల్ రష్యా నుండి 60 శాతం సబ్సిడీతో భారత దేశానికి వస్తోంద‌న్నారు. పెట్రోల్ బంకుల్లో రూ. 100 లేనిదే పెట్రోల్ రావ‌డం లేదన్నారు. రష్యా నుంచి క్రూడాయిల్ పై వచ్చే సబ్సిడీ ఎక్కడికి పోతోందో చెప్పాల‌న్నారు. సీఎం చంద్ర‌బాబును ఏకి పారేశారు చింతా మోహ‌న్. నిన్న సీఆర్డీఏ 30 వేల ఎక‌రాలు తీసుకుంద‌ని, మూరెడు మ‌ట్టి తీస్తే చారెడు నీళ్లు వ‌స్తున్నాయ‌ని అన్నారు. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంద‌ని, కేవ‌లం 30 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఇంకో అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్ర‌శ్నించారు.

Also Read : TPCC Chief Interesting Comments : సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి

Exit mobile version