TPCC Chief Interesting Comments : సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు

Hello Telugu - TPCC Chief Interesting Comments

Hello Telugu - TPCC Chief Interesting Comments

TPCC Chief : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పార్టీ ప‌రంగా సంస్థాగ‌త నిర్మాణం చేప‌ట్టాల‌ని అన్నారు. సోమ‌వారం ఆయ‌న పార్టీ శ్రేణుల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మేర‌కు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్‌లను నియమించిన‌ట్లు వెల్ల‌డించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఇంచార్జ్ లతో జూమ్ మీటింగ్ నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఇందులో రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ (Meenakshi Natarajan) కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా విధి విధానాల‌ను ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు క‌మిటీల నిర్మాణం ఏర్పాటు చేస్తామ‌న్నారు. వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు ఏఐసీసీ ఇంఛార్జ్.

TPCC Chief Key Comments

ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు మీనాక్షి న‌ట‌రాజ‌న్. తాజాగా తెలంగాణ‌లోని ఉమ్మ‌డి జిల్లాల‌కు ఇంఛార్జ్ లు నియ‌మించామ‌న్నారు. ఖ‌మ్మం జిల్లాకు సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు చ‌ల్లా వంశీచంద‌ర్ రెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లా కు ఏఐస‌సీ కార్య‌దర్శి సంప‌త్ కుమార్, వ‌రంగ‌ల్ జిల్లాకు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, మెద‌క్ జిల్లాకు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ , హైద‌రాబాద్ జిల్లాకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి, మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాకు పీఏసీ స‌భ్యుడు కుసుమ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ , క‌రీంన‌గ‌ర్ జిల్లాకు ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్, నిజామాబాద్ జిల్లాకు వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ అజ్మ‌త్ హుస్సేన్ , రంగారెడ్డి జిల్లాకు సాట్ చైర్మ‌న్ శివ సేనా రెడ్డిని నియ‌మించామ‌ని తెలిపారు.

Also Read : Minister Seethakka Fired on KTR : కేటీఆర్..నా జోలికి వ‌స్తే ఊరుకోను – సీత‌క్క

Exit mobile version