అమెరికా : స్టార్ లింక్ చైర్మన్, ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎలోన్ మస్క్ కొత్త సంవత్సరం సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ కు ఖుష్ కబర్ చెప్పారు. ప్రపంచాన్ని టెక్నాలజీ పరంగా షేక్ చేస్తూ, టాప్ లో కొనసాగుతూ వస్తున్న గూగుల్ కు చెందిన యూట్యూబ్ కు ఝలక్ ఇచ్చేలా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు క్రియేటర్స్ కు భారీ ఎత్తున డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టారు ఎలోన్ మస్క్. ఈ మేరకు దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ ప్రత్యేకంగా క్రియేటర్స్ కోసం కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది ఎక్స్ (ట్విట్టర్). ఇదే క్రమంలో ప్లాట్ఫారమ్లో అధిక-నాణ్యత, అసలైన కంటెంట్ను నిలుపుకునే వ్యూహంలో భాగంగా కంటెంట్ సృష్టికర్తలకు చెల్లింపులను గణనీయంగా పెంచనున్నట్లు స్పష్టం చేశారు ఎలాన్ మస్క్.
ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు గూగుల్ యూట్యూబ్ చెల్లించే దానికన్నా ఎక్కువగా చెల్లించాలని తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు తన అధికారిక ఎక్స్ వేదికగా . ఇది పూర్తిగా ప్రపంచ వ్యాప్తంగా రియల్ కంటెంట్ క్రియేటర్స్ కు మేలు చేకూరుస్తుందని , ఇందులో ఎలాంటి సందేహం లేదని వెల్లడించారు.
తాము చెల్లించబోయే ప్రోత్సాహకం యూట్యూబ్ చెల్లించే దానికంటే ఎక్కువగా ఉండబోతోందని సంచలన ప్రకటన చేశారు ఎలాన్ మస్క్. టెక్నాలజీ ప్రపంచంలో తాజాగా కొత్త ఏడాది సందర్బంగా ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన కలకలం రేపింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రియేటర్స్ కు ఇది సంతోషం కలిగించిన వార్త కావడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తాడో వేచి చూడాలి.
















