Elon Musk Effective Offfer : భారత వినియోగదారులకు ఎక్స్‌ భారీ గిఫ్ట్‌ – సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీ తగ్గింపు

వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు కంపెనీ మొబైల్, వెబ్‌ ప్లాట్‌ఫామ్లలో ప్రీమియం..

Hello Telugu - Elon Musk Effective Offfer

Hello Telugu - Elon Musk Effective Offfer

Elon Musk : ఎలాన్ మస్క్‌ అధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్‌ (X) (మాజీ ట్విటర్‌) భారతీయ వినియోగదారుల కోసం తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో భారీ రాయితీలను ప్రకటించింది. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు కంపెనీ మొబైల్, వెబ్‌ ప్లాట్‌ఫామ్లలో ప్రీమియం, ప్రీమియం ప్లస్‌ సేవలపై గణనీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది.

సోషల్ మీడియా ప్రపంచంలో ఇది వినూత్న చర్యగా కనిపిస్తుండగా, నెలవారీ చందాల్లో 48 శాతం వరకు తగ్గింపు కలిగినట్టు సంస్థ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌ ద్వారా వెల్లడించింది.

Elon Musk – మొబైల్ యాప్ వినియోగదారులకు శుభవార్త

ఎక్స్ (X) మొబైల్ యాప్‌ ద్వారా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి నెలవారీ ఛార్జీ రూ.900 నుండి రూ.470కి తగ్గింది. ఇది దాదాపు 48 శాతం తగ్గింపు కావడం విశేషం. యాప్ స్టోర్ ద్వారా రాబడే అదనపు ఛార్జీలు ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఇది చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తోంది.

వెబ్‌ వినియోగదారులకూ ఊరట

వెబ్‌ వేదికగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు రూ.650 నుండి రూ.427కి ధరను తగ్గించారు. ఇదే విధంగా ప్రాథమిక ప్రీమియం ప్లాన్‌ నెలవారీ చందా రూ.243.75 నుండి రూ.170కి తగ్గింది. వార్షిక చందా రూ.2,590.48 నుంచి రూ.1,700కి తగ్గించి సుమారు 34 శాతం తగ్గింపు అందించారు.

ఎక్స్‌ ప్రీమియం ప్లాన్లతో లభించే ఫీచర్లు

ప్రీమియం ప్లస్ వినియోగదారులకూ భారీ తగ్గింపు

ప్రీమియం ప్లస్ సేవల వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను వెబ్‌ వినియోగదారుల కోసం రూ.3,470 నుండి రూ.2,570కి తగ్గించారు. మొబైల్‌ యాప్‌ వినియోగదారులకైతే ఇదే ప్లాన్ రూ.3,000కి లభిస్తోంది. గతంలో ఇది రూ.5,100గా ఉండేది.

ఈ తాజా నిర్ణయం ద్వారా ఎక్స్‌ సంస్థ మరింత విస్తృత వినియోగదారులకు చేరువవుతుంది. డిజిటల్ యుగంలో వినియోగదారులకు అధిక విలువ కలిగిన సేవలను అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయమని నిపుణులు భావిస్తున్నారు.

Also Read : Tesla New Innovation : జూలై 15న ముంబై కు టెస్లా కొత్త బ్రాంచ్

Exit mobile version