అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రశంసల వర్షం కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై. మోదీ ఎప్పుడూ అలిసిపోరు..నిత్యం ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన వారిని ఉత్సాహ పరుస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ప్రధాని మోదీ సమానంగా నిలబడగలరు. ఇది నేను ఎంతో స్పష్టంగా చెప్పగలను. ఇది దేశానికే గర్వకారణం అన్నారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయి… కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదు… దేశం కోసం ఏర్పడిందని అన్నారు. అధికారం కోసం కాదు… దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని చెప్పారు సీఎం. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తోన్న విజయాలే సాక్ష్యం అన్నారు. బీహార్‌లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం అని చెప్పారు చంద్రబాబు నాయుడు. అసోంలో, పుదుచ్చేరిలో వరుస గెలుపుల ద్వారా ప్రజల ఆదరణను చాటుకుంది అని అన్నారు.
.
ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు… సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. ఒకప్పుడు ‘ఈరోజు బెంగాల్ ఆలోచిస్తే… రేపు భారత్ ఆలోచిస్తుంది” అనే పేరు ఉండేదన్నారు. స్వాతంత్రం తర్వాత దశాబ్దాల పాటు బెంగాల్ అభివృద్ధి ప్రధాన స్రవంతికి దూరమైందన్నారు. దేశం సంస్కరణలు, అభివృద్ధి వైపు సాగితే… బెంగాల్ పాత రాజకీయాల్లోనే చిక్కుకు పోయిందని పేర్కొన్నారు సీఎం . తాజాగా అక్కడ జరిగిన మార్పుతో బెంగాల్ దిశ మళ్లీ అభివృద్ధి వైపు సాగనుంది. మారుతున్న భారత ఆకాంక్షలకు అనుగుణంగా బెంగాల్ అడుగులు వేస్తోంది. భారతీయత పునరుజ్జీవం పొందడం గత 12 ఏళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పు అని పేర్కొన్నారు సీఎం. వికాస్ బీ… విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకం. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలం అని చెప్పారు.
సమర్థవంతమైన నాయకత్వం దేశానికి బలం
ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు
