అంబర్‌పేట శంక‌ర్ పై క్రిమిన‌ల్ కేసు

బిల్డ‌ర్ ఆంజ‌నేయులు ఫిర్యాదు

hellotelugu-AmberpetShankar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అంబర్ పేట శంక‌ర్ పై కేసు న‌మోదైంది. నిర్మాణ రంగానికి చెందిన ప్ర‌ముఖ బిల్డ‌ర్ ఆంజ‌నేయులు శంక‌ర్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. త‌న‌తో పాటు త‌న కుటుంబాన్ని ఇబ్బందుల‌కు గురి చేశార‌ని, బెదిరించారంటూ వాపోయారు. ఈ మేర‌కు అంబ‌ర్ పేట శంక‌ర్ పై న‌గ‌రంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ వివాదానికి సంబంధించి త‌మ‌ను బెదిరించార‌ని , అంతు చూస్తామంటూ హెచ్చ‌రించార‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక పోలీస్ స్టేష‌న్ ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు బాధితుడు.

అంతే కాకుండా కుటుంబ సభ్యులకు హాని చేస్తామని అంబ‌ర్ శంకర్ తో పాటు మరో ఆరుగురు హెచ్చ‌రించిన‌ట్లు బాధితుడు ఫిర్యాదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు బంజారాహిల్స్ పోలీసులు . శంకర్ సహా ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఇదిలా ఉండ‌గా అంబ‌ర్ పేట శంక‌ర్ చాలా పేరున్న వ్య‌క్తి. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. ఆయ‌న‌కు అన్ని పార్టీల నేత‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. అంబర్ పేట‌లో త‌న పేరు చెబితే చాలు జ‌డుసుకుంటారు. పేద‌ల నాయ‌కుడిగా పేరు పొందారు.

ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌ను ముందుంటాడ‌నే పేరుంది. పేద‌ల మ‌నిషిగా, ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంబ‌ర్ పేట శంక‌ర్ పై ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఎవ‌రికి ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా త‌ను ముందుండ‌డం, వారికి భ‌రోసా క‌ల్పించ‌డం అంబ‌ర్ పేట శంక‌ర్ కు ఉన్న ప్ర‌త్యేక‌త‌.

Exit mobile version