జ‌గ‌న్ కు షాక్ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ..?

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మ‌రో వికెట్ డౌన్

hellotelugu-APLiquorScam

అమ‌రావ‌తి : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీ లిక్క‌ర్ స్కాం కేసులో మ‌రో వికెట్ ప‌డింది. త‌న అన‌చ‌రుడిగా పేరు పొందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర్ రావు ను గురువారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వర్ రావు ను అదుపులోకి తీసుకోవడం క‌ల‌క‌లం రేపుతోంది.

ఉదయం నుండి లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ రాజ్ కేసిరెడ్డి నివాసాలు, మాజీ మంత్రి కారుమూరికి చెందిన నివాసాలు అటు విజయవాడ ఇటు హైదరాబాద్ సహా పలుచోట్ల ఈడి అధికారులు సోదాలు చేపట్టారు..!ముందుగా రాజ్ కేసిరెడ్డిని తర్వాత కారుమూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక నిందితులుగా ఆరోపించ బడుతున్న వాళ్లందరికీ బెయిల్‌ రాగా ఇప్పుడు మరో మాజీ మంత్రికి ఉచ్చు బిగించింది ఈడీ. ఇప్పటికే సిట్‌ కారుమూరి ఇంటికి నోటీసులు అంటించగా..వాట్‌ నెక్స్ట్ అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఇంకేం జరగబోతోందోన‌ని ఉత్కంఠ రేపుతోంది.

కాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఆయన క్యాడర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలన్నదట్లుగా లిక్కర్ స్కామ్ కేసు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని..అందులో కారుమూరి కుటుంబం కీలక పాత్ర పోషించిందనేది ప్రధాన ఆరోపణ. కారుమూరి కుమారుడు సునీల్, కోడలు కీర్తి అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానించారు.

Exit mobile version