Eesha Rebba : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ , ఈషా రెబ్బా (Eesha Rebba) కలిసి నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి. ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించాడు. పూర్తిగా భావోద్వేగాలను ప్రతిఫలించేలా చిత్రీకరించాడు. మూవీ వర్స్ స్టూడియోస్ తో పాటు ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం కలిగి ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఆయన పేరు చెబితే చాలు పెళ్లి చూపులు మూవీ గుర్తుకు వస్తుంది.
Eesha Rebba Om Shanti Shanthi Shantihi Movie Updates
కాగా ఎస్ ఒరిజినల్స్ వ్యవస్థాపకుడు సృజన్ యరబోలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం తమకు ఎదురు కాలేదని, పూర్తిగా సామాజిక కోణంలో భావోద్వేగాలు ప్రతిఫలించేలా సినిమాను తీయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందని తెలిపారు.
ప్రత్యేకించి ప్రాణం పెట్టి నటించారంటూ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల గురించి ప్రశంసలు కురిపించారు నిర్మాత. ఇన్ 10 మీడియా మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పిట్టీ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. అందుకే సినిమాను కలిసి నిర్మించడం జరిగిందని చెప్పారు. సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ప్రాంతీయ కంటెంట్ కు మరింత బలం చేకూర్చేలా మూవీస్ తీయాలని తాము అనుకున్నామని స్పష్టం చేశారు.
Also Read : Hero Rajinikanth Coolie : రజినీకాంత్ రికార్డ్ కూలీ 100 దేశాల్లో రిలీజ్..?



















