Coolie : తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్ లో అరుదైన రికార్డ్ ను సృష్టించారు. ఏకంగా తను నటించిన తాజా చిత్రం కూలీ (Coolie) ఓవర్సీస్ రైట్స్ ను రూ. 80 కోట్లకు అమ్మారు. దీనిని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే తాము పెట్టిన ఖర్చంతా తిరిగి వచ్చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. మనోడు తక్కువ టైంలో అనుకున్న సినిమాను పూర్తి చేయడం అలవాటు. ఇదే సమయంలో తను తీసిన కూలీ రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది.
Rajinikanth Coolie Movie Release Updates
తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ప్రపంచంలోని 100 దేశాల్లో రజనీకాంత్ నటించిన కూలీ విడుదల కాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ చలనచిత్ర పంపిణీలో కీలక పాత్ర పోషించే హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ప్రపంచ పంపిణీకి మద్దతు ఇస్తుండడంతో ఇది నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇదే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 130 కి పైగా చిత్రాలను విడుదల చేసింది. భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది దీనికి. ఇప్పటికే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. కూలీ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అంతకు ముందు తమిళ సినీ రంగంలో స్టార్ ఇమేజ్ కలిగిన అరుదైన నటుడు దళపతి విజయ్ నటించిన గోట్ చిత్రాన్ని 40కి పైగా దేశాలలో హింసిని సంస్థ విడుదల చేసింది. ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కీలక పాత్ర పోషించిన చిత్రం దేవర. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. దీనిని హింసిని 90కి పైగా దేశాలలో రిలీజ్ చేసింది.
Also Read : Popular Actress Bhavana : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి భావన


















