ED Raids : ఉత్తరప్రదేశ్ – కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. దేశంలోని పలువురు బాబాలపై , వారి కార్యకలపాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్, ముంబై నగరాలలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. మత మార్పిడికి పాల్పడుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఛంగూర్ బాబా. ప్రస్తుతం తను లక్నోతో పాటు ముంబైలో పలు ఆస్తులు సంపాదించినట్లు సోదాలలో బయట పడింది.
ED Raids on Changur Baba’s Properties
ఛంగూర్ బాబా అసలు పేరు జమాలుద్దీన్ షా. తనంతకు తానుగా దేవదూతగా ప్రకటించుకున్నాడు. భారీగా మత మార్పిడులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించింది ఈడీ (ED Raids). మతమార్పిడి రాకెట్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. కొనసాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ జిల్లాలో 12 , ముంబైలో రెండు సహా 14 వేర్వేరు ప్రదేశాలలో ఏజెన్సీ విస్తృతమైన సోదాలు నిర్వహించింది.
ED అధికారుల ప్రకారం, లక్నో జోనల్ యూనిట్ సోదాలు ప్రారంభించింది. సోదాలు 13 గంటలకు పైగా కొనసాగాయి. ఆధ్యాత్మిక మార్గ దర్శకత్వం నెపంతో పెద్ద ఎత్తున మత మార్పిడులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారీగా విదేశీ నిధులు, అక్రమ ఆర్థిక లావాదేవీల చుట్టూ దర్యాప్తు కేంద్రీకృతమై ఉంది. రూ. 100 కోట్లకు పైగా నిధులు అందినట్లు అనుమానిస్తున్న ఈ కేసుపై ED దర్యాప్తు చేస్తోందని ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
Also Read : MLA Harish Rao Shocking Comments : మా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న సీఎం – హరీశ్ రావు
