డీకే శివ‌కుమార్ కు షాక్ ఈడీ నోటీస్

కేంద్రం క‌క్ష సాధిస్తోందంటూ ఫైర్

hellotelugu-DKShivakumar

బెంగళూరు : క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ). ఈ మేర‌కు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడ‌బ్ల్యూ) కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.ఈ నోటీసులో ఆర్థిక లావాదేవీల వివరాలను అందించాలని కోరింది. ఈ నోటీసు గ‌త నెల నవంబర్ 29 న పంపింది. తాజాగా ఈడీ అందించిన నోటీసుల‌పై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు బెంగ‌ళూరులో. ఇది నాకు చాలా షాకింగ్ గా ఉంద‌న్నారు. తాను గ‌తంలో ఈడీకి అన్ని వివ‌రాలు అందించాన‌ని చెప్పారు.

మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని వారు నాతో పాటు త‌న సోద‌రుడు మాజీ ఎంపీ డీకే సురేష్ ను కూడా ప్ర‌శ్నించారు. అన్ని వివ‌రాలు అందించామ‌న్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. కానీ అనుకోకుండా మ‌రోసారి నోటీసులు ఇవ్వ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇదంతా కావాల‌ని కేంద్రం లోని బీజేపీ స‌ర్కార్ ఆడుతున్న నాట‌కంగా ఆయ‌న పేర్కొన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము పార‌ద‌ర్శ‌కంగా లావాదేవీలు నిర్వ‌హించామ‌న్నారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా, పోలీసులు కేసు నమోదు చేయవలసిన అవ‌స‌రం ఏమొచ్చిందో వారికే తెలియాల‌న్నారు.

Exit mobile version