Vinod Kumar Shocking Comments on EC : ఈసీ ప‌క్ష‌పాత వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తోంది – వినోద్ కుమార్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగే ఛాన్స్

Hello Telugu - Vinod Kumar Shocking Comments on EC

Hello Telugu - Vinod Kumar Shocking Comments on EC

Vinod Kumar : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయ‌న‌ప‌ల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసీ పక్ష‌పాత వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ పార్టీ ప‌రంగా ఫిర్యాదు చేశామ‌న్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా మూడు రోజుల గడువే ఉందన్నారు.
ఎన్నికల కమిషన్ దృష్టికి బీఆర్ఎస్ చాలా అంశాలు తీసుకెళ్లిందన్నారు. బీఆర్ఎస్ తరపున కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులకు కేసీఆర్ త‌న‌ను, సోమా భరత్‌ను నియమించారని చెప్పారు. తెలంగ‌ణ భ‌వ‌న్ లో మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు తాము కేటీఆర్‌తో కలిసి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి మా అభిప్రాయాలు చెప్పామ‌న్నారు.

Vinod Kumar Shocking Comments

దుర‌రదృష్టశావత్తు కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో పని చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వినోద్ కుమార్. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా త‌మ‌ పార్టీ నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింద‌న్నారు. తమ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిలపై ఏవో వ్యాఖ్యలు చేశారని అప్పట్లో 48 గంటల పాటు వారి ప్రచారంపై నిషేధం విధించిన విష‌యాన్ని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించేలా ఉన్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని నిల‌దీశారు.

Also Read : BRS Shocking Allegations : జూబ్లీ హిల్స్ లో రిగ్గింగ్ జ‌రిగే ఛాన్స్ : బీఆర్ఎస్

Exit mobile version