Turmeric : భారతీయ వంటకాలలో పసుపు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే పసుపును (Turmeric) ‘ఆయుర్వేద బంగారం’ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అయితే, దీనిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Turmeric – పసుపు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- నొప్పి నివారణ: పురాతన కాలం నుంచి కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల చికిత్సలో పసుపు (Turmeric) వినియోగిస్తున్నారు.
- గుండె ఆరోగ్యం: రక్తనాళాల పనితీరును మెరుగుపరచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది.
- మధుమేహ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది.
- రోగనిరోధక శక్తి: శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులను నివారించగలదు.
అధిక మోతాదులో తీసుకుంటే వచ్చే దుష్ప్రభావాలు
- విషపూరితం: రోజుకు 5–10 గ్రాముల కంటే ఎక్కువ పసుపు తీసుకుంటే అది శరీరానికి హానికరం కావచ్చు.
- జీర్ణ సమస్యలు: అధిక మోతాదులో పసుపు తీసుకుంటే కడుపునొప్పి, వికారం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
- అలర్జీలు: కొంతమందిలో చర్మ దురద, దద్దుర్లు లేదా కడుపు నొప్పి వంటి అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
- శరీర వేడి: ఆయుర్వేదం ప్రకారం పసుపు వేడిని పెంచే మసాలాగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వేసవిలో అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.
- బరువు తగ్గడం: బరువు పెరగాలనుకునే వారు అధికంగా పసుపు తీసుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు రావచ్చు.
- ఇతర సమస్యలు: డీహైడ్రేషన్, మలబద్ధకం లేదా పొడి చర్మం ఉన్నవారు పసుపును మితంగా, నెయ్యి వంటి కొవ్వులతో కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
పరిశోధనల ప్రకారం రోజుకు 500 నుండి 1000 మిల్లీగ్రాముల పసుపు తీసుకోవడం సురక్షితం. మితంగా తీసుకోవడం ద్వారా పసుపు అనేక వ్యాధులను నివారించగలదని, ఆరోగ్యాన్ని కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు వాడకానికి ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
Also Read : Heart Health Important Tips : ఈ అలవాట్ల వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని నాశనం



















