Ear Interesting Health Updates : ఈ నాలుగు వస్తువులు తిన్నారంటే మీకు ఎప్పటికీ చెవి నొప్పి రాదు

ఆరోగ్యకరమైన వినికిడి కోసం వీటిని ప్రతిరోజూ తీసుకోవాలని సూచించారు...

Hello Telugu - Ear Interesting Health Updates

Hello Telugu - Ear Interesting Health Updates

Ear : వినికిడి లోపానికి వంశపారంపర్య కారణాలు, వయస్సు పెరగడం, శబ్ద కాలుష్యం ప్రధాన కారణాలుగా గుర్తించబడుతున్నాయి. అయితే, మన ఆహారపు అలవాట్లు కూడా చెవుల (Ear) ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వినికిడి సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రముఖ ఈఎన్‌టీ నిపుణుడు డాక్టర్ శ్రీరావు, చెవుల ఆరోగ్యాన్ని కాపాడే నాలుగు ముఖ్యమైన ఆహార పదార్థాలను వివరించారు. ఆరోగ్యకరమైన వినికిడి కోసం వీటిని ప్రతిరోజూ తీసుకోవాలని సూచించారు.

Ear Interesting Updates

1. ఆకుకూరలు

ఆకుకూరలు కళ్ళు, ఎముకలు, గుండెకు మాత్రమే కాకుండా చెవులకు కూడా ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో విటమిన్‌ B12, ఫోలేట్‌ అధికంగా ఉండి కణాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శబ్ద కాలుష్యం, వయస్సుతో వచ్చే వినికిడి లోపాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

2. చేపలు, గుడ్లు

చేపలు, గుడ్లు చెవుల ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ B12 యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి చెవులను రక్షిస్తాయి.

3. పండ్లు, కూరగాయలు

రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండు వినికిడి సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరమని చెబుతున్నారు. నారింజలు, చిలగడదుంపలలో ఉండే పొటాషియం లోపలి చెవిలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.

4. గింజలు, విత్తనాలు

గుమ్మడి గింజలు, అవిసె గింజలు, జీడిపప్పు, బాదం వంటి గింజలు, విత్తనాలు చెవులకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, జింక్ చెవులను రక్షించే శక్తివంతమైన పోషకాలు. ఇవి శబ్ద కాలుష్యం వల్ల కలిగే వినికిడి లోపాన్ని నివారించడంలో ఉపయోగకరమని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : GDP Growth : పరుగులు తీస్తున్న జీడీపీ.డీలా పడ్డ రూపాయి విలువ

Exit mobile version