Early Signs of Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చే ముందు హెచ్చరికలు ఇలా

30 ఏళ్ల లోపే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి...

Hello Telugu - Early Signs of Heart Attack

Hello Telugu - Early Signs of Heart Attack

Heart Attack : ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా యువతలో గుండెపోటు (Heart Attack) కేసులు పెరుగుతున్నాయంటే ఇది సమాజానికి గమనించదగ్గ పరిణామం. 30 ఏళ్ల లోపే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి.

వైద్య నిపుణుల ప్రకారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పని భారం, జీవనశైలి మార్పులు వంటి అంశాలు యువతలో గుండె జబ్బులకు (Heart Attack) ప్రధాన కారణాలు అవుతున్నాయి. కానీ, గుండెపోటు అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. శరీరం ముందుగానే కొన్ని హెచ్చరికల ద్వారా ప్రమాద సంకేతాలు ఇస్తుందని, వాటిని గుర్తించకపోతే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Heart Attack – గుండెపోటుకు ముందు కనిపించే ముఖ్య లక్షణాలు:

విపరీతమైన నీరసం, శరీరదౌర్భల్యం, కడుపులో మంట, ఛాతీ నొప్పి, కళ్లు మసకబారడం, అధిక చెమటలు, రక్తపోటు లోబడి పోవడం వంటి లక్షణాలు గుండె సంబంధిత సమస్యలకు సూచనలు కావచ్చని వైద్య నిపుణులు వివరించారు.

ఈ లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగా భావించి మెడికల్ షాపుల్లో పళ్లెం మందులతో పరిష్కారం పొందాలని ప్రయత్నిస్తారు. మరికొందరైతే సోడా, శీతలపానీయాలతో సమస్యను తాత్కాలికంగా తగ్గించేందుకు యత్నిస్తారు. ఈ రకమైన నిర్లక్ష్యం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందన్నారు.

నిర్లక్ష్యం చేసినవారిలో ప్రమాదం పెరుగుతుంది:

పలు సందర్భాల్లో చిన్న చిన్న నొప్పులను గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవకపోవడం వల్ల గుండెపోటు ప్రాణాపాయ స్థాయికి చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదాహరణకు, ఓ 37 ఏళ్ల వ్యక్తి పదివారాలుగా కడుపులో మంట అనుభవిస్తున్నా, అది గుండెపోటుకు సంకేతమని గుర్తించక గ్యాస్ట్రిక్ అనుకుని ఆలస్యం చేశాడు. చివరికి అతనికి పెద్దస్థాయిలో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారణ కావడం జరిగింది.

నిర్లక్ష్యం కాకుండా, తగిన పరీక్షలు తప్పనిసరి:

గుండె సంబంధిత ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయడానికి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా 30 ఏళ్ల పైబడిన వారు ఏడాదికొకసారి లిపిడ్ ప్రొఫైల్, HbA1c, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎప్పటికప్పుడు గుండె పనితీరును అంచనా వేసుకుంటూ, షుగర్‌, బీపీ వంటి సమస్యలను నియంత్రణలో ఉంచితే గుండె జబ్బుల నివారణ సాధ్యమవుతుంది.

తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన సూచనలు:

ఈ లక్షణాలేమైనా కనిపిస్తే, వెంటనే కార్డియాలజీ నిపుణుల్ని సంప్రదించాలి.

Also Read : Donald Trump Shocking Comments : బంగారంపై ఎలాంటి సుంకాలు లేవంటున్న ట్రంప్

Exit mobile version