Mirai : టీజీ విశ్వ ప్రసాద్ , కృతి ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో విడుదలైన చిత్రం మిరాయ్. అంచనాలు మించి కాసులను కురిపిస్తోంది. తేజ సజ్జా (Teja Sajja), రితికా రాయ్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ శరణ్ కీలక పాత్రలు పోషించారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ను వాడడం , మ్యూజిక్, నటీ నటుల ప్రదర్శన ఓ రేంజ్ లో ఉండడంతో భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 2 మిలియన్లు దాటడం విశేషం. మూడు రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ ను దాటేసింది. దీంతో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు సినీ బృందం . ఇది పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి నేటి దాకా 5 రోజుల్లో బుక్ మై షో ద్వారా 1.05 లక్షల టికెట్లు అమ్ముడు పోవడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Mirai Movie Sensational Collections
ఇది దేశవ్యాప్తంగా థియేటర్లలో బలమైన డిమాండ్‌ను హైలైట్ చేస్తోంది. భారతీయ మార్కెట్లలో ఇటువంటి సమాంతర ఆధిపత్యం యువ నటుడికి చాలా అరుదు అని వాణిజ్య నిపుణులు అంటున్నారు, ఇది తేజ విజయాన్ని మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది.బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత అమెరికాలో 2 మమిలియన్లు సాధించడం మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో విడుదలైన మూవీలలో మిరాయ్ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మద్దతుతో మిరాయ్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. రాబోయే రోజులల్లో ఈ చిత్రం ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేసే దిశగా సాగి పోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : Minister Damodar Interesting Updates : ఉస్మానియా ఆస్పత్రి అప్ గ్రేడ్ : దామోదర
