హైదరాబాద్ : ఓ వైపు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇవాళ దసరా పండుగ. ఎక్కడా మద్యం షాపులు తెరవ కూడదని, బంద్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర సర్కార్. కానీ వాటిని పక్కన పెట్టారు మద్యం బాబులు. ముందస్తుగా కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున మద్యాన్ని. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను లేపేశారు. ఇది విస్తు పోయేలా చేసింది రాష్ట్ర ప్రజలను. ఇదిలా ఉండగా గాంధీ జయంతి ఆంక్షల నుండి తప్పించు కోవడానికి మద్యం ప్రియులు దుకాణాలు, వినియోగదారులు దసరాకు ముందే కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఓ వైపు మద్యం బాబుల కారణంగా పెద్ద ఎత్తున రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రం ఏమిటంటే గత నెల సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1వ తేదీ బుధవారం వరకు కేవలం నాలుగు రోజుల్లోనే పెద్ద ఎత్తున మద్యం కాటూన్లు అమ్ముడు పోయాయి.
రాష్ట్ర సర్కార్ పరిధిలోని మద్యం ఔట్ లెట్ల డిపోల నుంచచి రూ. 1000 కోట్లకు పైగా విలువైన స్టాక్ లు పూర్తయ్యాయి. పండుగ రద్దీని తీర్చడానికి అవుట్‌లెట్‌లు సామాగ్రిని నిల్వ చేసుకున్నా , కృత్రిమ కొరత సృష్టించి మద్యం దుకాణాదారులు పెద్ద ఎత్తున ధరలు పెంచుతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మద్యం ప్రియులు భారీ ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. దీనిపై ఎంతగా నియంత్రణ ఉన్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆయా తేదీలలో లెక్కల వారీగా చూస్తే దిమ్మ తిరిగేలా మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ నెల 28వ తేదీన రూ. 260 కోట్లు అమ్మకాలు జరగగా, 29న రూ. 279 కోట్లు, 30న రూ. 301 కోట్లు, అక్టోబర్ 1న రూ. 320 కోట్ల విలువైన మద్యం నిల్వలు అమ్ముడు పోయాయి.
