Hero Vijay Sethupathi – Dr Ramya Mohan : విజ‌య్ సేతుప‌తి విమ‌నైజ‌ర్ – డాక్ట‌ర్ ర‌మ్య

త‌ను పెద్ద విమెనైజ‌ర్ అంటూ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Hero Vijay Sethupathi - Dr Ramya Mohan

Hello Telugu - Hero Vijay Sethupathi - Dr Ramya Mohan

Vijay Sethupathi : త‌మిళ సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపు పొందాడు విజ‌య్ సేతుపతి. ఆ మ‌ధ్య‌న పాన్ ఇండియా మూవీలో కూడా న‌టించాడు. ప‌లు సినిమాల‌లో బిజీగా ఉన్నాడు. తెలుగు వారికి ఉప్పెన‌తో సుప‌రిచితుడే. ప్ర‌స్తుతం భిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తూ టాప్ హీరోల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. తాజాగా విజ‌య్ సేతుప‌తిపై (Vijay Sethupathi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది డాక్ట‌ర్ ర‌మ్యా మోహ‌న్. త‌ను చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త‌ను అనుకున్నంత మంచోడు కాదని ఆరోపించారు వైద్యురాలు. ఆయ‌న అతిపెద్ద వుమెనైజ‌ర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Dr Ramya Mohan Slams Vijay Sethupathi

కోలీవుడ్ లో ఇలాంటివి మామూలేన‌ని పేర్కొంది. ఇక్క‌డ డ్ర‌గ్స్, కాస్టింగ్ కౌచ్ అనేది కొన‌సాగుతూనే ఉంద‌ని వాపోయింది. త‌న‌కు తెలిసిన ఓ అమ్మాయి మీడియాలో ప‌ని చేసేద‌ని, త‌న‌ను అన‌వ‌స‌రంగా సినిమా రంగంలోకి లాగారంటూ తెలిపింది. త‌ను ఇప్పుడు రిహాబిలిటేష‌న్ సెంట‌ర్ లో చికిత్స పొందుతోంద‌ని, చికిత్స తీసుకుంటోంద‌ని చెప్పింది. కానీ పైకి మంచి వాడి లాగా క‌నిపించే విజ‌య్ సేతుప‌తి అంద‌రూ అనుకున్నంత మంచోడు కాదంటూ పేర్కొంది ర‌మ్యా మోహ‌న్. ఇవ‌న్నీ బ‌య‌ట‌కు తెలిసినా చెప్పేందుకు ముందుకు రార‌ని తెలిపింది.

ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. ఆ త‌ర్వాత ఏమైందో కానీ ఉన్న‌ట్టుండి షేర్ చేసిన పోస్టును తొల‌గించింది. ఆ వెంట‌నే క్ష‌ణాల్లోనే సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ గా మారింది ఈ పోస్ట్. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ లేదు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విజ‌య్ సేతుప‌తి.

Also Read : Hero Pawan – Hari Hara Veera Mallu : హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా కాదు ఓ చ‌రిత్ర

Exit mobile version