BRS Party Road Show Sensational : 31 నుండి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ రోడ్ షోలు

ప్ర‌క‌టించిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ

Hello Telugu - BRS Party Road Show Sensational

Hello Telugu - BRS Party Road Show Sensational

BRS Party : హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూబ్లీ హిల్స్ శాస‌న స‌భ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అక్టోబర్ 31 నుండి నవంబర్ 9 వరకు రోడ్ షోలు నిర్వహించనున్న‌ట్లు తెలిపింది. ఈ రోడ్ షోల‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వ‌హిస్తార‌ని తెలిపింది. ప్ర‌చార షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబర్ 31న షేక్‌పేట్ లో , నవంబర్ 1న రెహమత్‌నగర్, 2వ తేదీన యూసుఫ్‌గూడ, 3న బోరబండ‌, 4న సోమాజిగూడ‌, 5న వెంగ‌ళ‌రావు న‌గ‌ర్, 6న ఎర్ర‌గ‌డ్డ‌, 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్‌నగర్, 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు. ఇదిలా ఉండ‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ‌చ్చే న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

BRS Party Road Show

14న ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది బీఆర్ఎస్ (BRS Party). ఈ ఉప ఎన్నిక‌లలో మొత్తం 81 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ప్ర‌ధానంగా పోటీ మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ , బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ నుంచి రౌడీ షీట‌ర్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌వీన్ యాద‌వ్ ఉండ‌గా మ‌రో వైపు గ‌తంలో పోటీ చేసి మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బ‌రిలో ఉన్నారు. ఇప్ప‌టికే బి ఫారం ఇచ్చారు. మ‌రో వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున లొంకాల దిలీప్ రెడ్డి బ‌రిలో ఉన్నారు.

Also Read : Nara Lokesh Important Update : సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాం : లోకేష్

Exit mobile version