Donald Trump : అమెరికా – యుఎస్ ప్రెసిడెంట్ ఓ వైపు మోదీ తనకు మిత్రుడు అంటూనే మరో వైపు భారత దేశానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అమెరికాను శాసిస్తున్న వారిలో అత్యధికంగా ప్రవాస భారతీయులే ఉన్నారు. ఏరికోరి ఎన్నుకున్నాక తన నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు. తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. దాయాది పాకిస్తాన్ కు నిస్సిగ్గగా మద్దతు పలికారు. ఆపై తాను ప్రయత్నం చేయడం వల్లనే యుద్దం ఆగిందంటూ ప్రకటించాడు. ఆ తర్వాత మోదీ ఖండించారు. ఇది పక్కన పెడితే అమెరికా జాత్యహంకారాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. ఏకంగా భారతీయులను టార్గెట్ చేశాడు ట్రంప్.
Donald Trump Shocking Comments
ఇండియా తమకు చిరకాల మిత్రుడు అంటూనే సందర్భం వచ్చిన ప్రతీసారి ఇండియాపై తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు డొనల్డ్ ట్రంప్ (Donald Trump). వాషింగ్ టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో ట్రంప్ ప్రసంగించాడు. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు ఆపి అమెరికాపై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు పని చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశించారు.
మన దేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ.. భారతీయ ఉద్యోగులను నియమించుకొంటూ, ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోక పోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి చేశారని వాపోయారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం అన్నారు. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే ఉండాలన్నారు. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పని చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Supreme Court Shocking : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
