Donald Trump Shocking Comments : భార‌త‌దేశంపై సుంకాల విధింపు స‌బ‌బే

స‌మ‌ర్థించుకున్న అమెరికా చీఫ్ ట్రంప్

Hello Telugu - Donald Trump Shocking Comments

Hello Telugu - Donald Trump Shocking Comments

Donald Trump : అమెరికా – యుఎస్ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఇండియాపై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు. సుంకాల విధింపుపై స్పందించారు. ఇది కావాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు. అన్నీ ఆలోచించిన త‌ర్వాత‌నే తాను సుంకాల‌ను విధించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. బుధ‌వారం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. సుంకాల విధింపు స‌మ‌ర్థ‌నీయ‌మేన‌ని పేర్కొన్నారు. ఇండియా ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను వసూలు చేస్తోందని, దీనివల్ల అసమతుల్య వాణిజ్య పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ (Donald Trump) పునరుద్ఘాటించారు . అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను సమర్థించిన కొన్ని రోజుల తర్వాత, ఆయన మరోసారి త నిర్ణ‌యాన్ని సమర్థించుకున్నారు.

Donald Trump Shocking Comments on Tarrifs

రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు దశాబ్దాలుగా పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని అన్నారు. వైట్ హౌస్ వద్ద భారతదేశంపై సుంకాలను పునః పరిశీలించడం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భార‌త్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను వసూలు చేస్తోందని, ఇది అసమతుల్య వాణిజ్య పరిస్థితిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించారు. తాము భారతదేశంతో చాలా బాగా కలిసి ఉన్నామన్నారు. కానీ ఆ దేశం చాలా సంవత్సరాలుగా ఇది ఏకపక్ష సంబంధంగా కొట్టి పారేశారు. విచిత్రం ఏమిటంటే త‌మ దేశం నుండి అత్య‌ధికంగా సుంకాల‌ను వ‌సూలు చేస్తోంద‌ని ఆరోపించారు. మా నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున తాము ఈ అసాధార‌ణ నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు ట్రంప్.

Also Read : Appeals Court Shocking Trump : ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్

Exit mobile version