తిరుచిరాపల్లి : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి త్రిషను ఉద్దేశించి తాను కామెంట్స్ చేశానంటూ తనను అదుపులోకి తీసుకోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఆయన బుధవారం బెయిల్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్బంగా తిరుచిరాపల్లిలో మీడియాతో మాట్లాడారు. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ద్వంద్వార్థం వచ్చేలా కాకుండా, రైతుల సంక్షేమం కోసం కావేరీ నీటిని విడుదల చేయాలని కోరుతూ స్పష్టమైన అర్థం వచ్చేలా మాట్లాడాను. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు ఉదయనిధి స్టాలిన్.
ఇదిలా ఉండగా ఉదయనిధి స్టాలిన్ గురించి డీఎంకే న్యాయవాది , రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్. ఎలాంగో కీలక వ్యాఖ్యలు చేశారు. అదొక భారీ సభ. అన్ని వర్గాల ప్రజలు ఆ బహిరంగ సభకు మద్దతు తెలిపారు; ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు (చర్యలు తీసుకోకపోవడం) గురించి ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయన అసెంబ్లీకి రాకుండా, అత్యంత కీలకమైన ప్రశ్నలను లేవనెత్తకుండా అడ్డుకునే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేయాలని భావించింది. అయితే, మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో తమ తప్పును గ్రహించిన ప్రభుత్వం, ఆయన్ని రిమాండ్‌కు తరలించే బదులు వైద్య పరీక్షల కోసం తంజావూరుకు తీసుకెళ్లి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని నిర్ణయించుకుందని పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని కోర్టు ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించిందని చెప్పారు.
