DK Shivakumar : కర్ణాటక కేబినెట్ విస్తరణ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టి పారేశారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తమ పార్టీకి చెందిన సీనియర్లు, ఎమ్మెల్యేలు మంత్రి పదవి వస్తుందని బయటకు చెబుతున్నారని, అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా తాను సీఎంతో చర్చించిన తర్వాతనే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇవన్నీ పుకార్లు తప్ప వాస్తవాం కాదన్నారు డీకే శివకుమార్ (DK Shivakumar). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగతా పార్టీలలో కంటే తమ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారని చెప్పారు.
Deputy CM DK Shivakumar Shocking Comments
అయినంత మాత్రాన ఎవరినీ తాము తప్పు పట్టడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ కేబినెట్ విస్తరణ అనేది జరిగితే అది పూర్తిగా పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుందన్నారు. కేవలం తాను, సీఎం సిద్దరామయ్య ఎవరికి ఇవ్వాలనే దానిపై జాబితా మాత్రమే పంపించడం జరుగుతుందన్నారు డీకే శివకుమార్. తాము రాష్ట్రంలో కొలువు తీరి రెండున్నర ఏళ్లు పూర్తయిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. అందుకే తాను బెంగళూరును దేశంలోనే నెంబర్ వన్ సిటీగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా నగర వాసులతో నేరుగా కలుస్తున్నానని అన్నారు. నగర వాసులు తమ అభిప్రాయలు, సూచనలు తెలియ చేయాలని ఈ సందర్బంగా కోరారు డీకే శివకుమార్.
Also Read : CM Chandrababu Important Talk : బీసీ హస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై సీఎం ఆరా
