అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, రిజల్ట్ ఓరియంటేషన్ తో పని చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో 7వ కలెక్టర్ల సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలు కలెక్టర్ల సదస్సులో వివరించారు. దాదాపు 100కు పైగా పథకాలు, ప్రభుత్వ సేవల అందిస్తున్నామన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని పేర్కొన్నారు. తల్లికి వందనం కింద రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం చేశామన్నారు సీఎం. స్త్రీ శక్తి కింద ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభిస్తామన్నారు. మహిళలు 63.61 కోట్ల ప్రయాణాలు చేశారన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించామన్నారు. దీపం 2 పథకం కింద 4 కోట్ల సిలిండర్లు ఇచ్చామన్నారు సీఎం. 269 అన్న క్యాంటీన్‌ల ద్వారా 9.15 కోట్ల భోజనాలు చేశారని తెలిపారు సీఎం.
అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పటివరకు రూ.63 వేలకోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు చేశామన్నారు. మత్స్యకార సేవలో ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు ఇచ్చామని తెలిపారు సీఎం. మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు చేశామని, నీటి వనరులపై హక్కు కల్పించినట్లు చెప్పారు . ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది చేకూరిందన్నారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయించామన్నారు సీఎం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

















