అమరావతి : గ్యారెంటీడ్ ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పాఠశాలలకు, విద్యార్థులకు వివిధ రకాల బోధనా సామగ్రిని (TLM) అందజేశాయి. 2025-26 విద్యా సంవత్సరంలో సరఫరా చేసిన వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. జాదూయ్ పిటారా కిట కు సంబంధించి ఆటల ద్వారా నేర్చుకోవడానికి రూపొందించిన ఒక మ్యాజిక్ బాక్స్ వంటి కిట్. ఇందులో ఆటబొమ్మలు, పజిల్స్, ఫ్లాష్ కార్డ్‌లు, కృత్యాధార బోధన కోసం అవసరమైన 62 వస్తువులు ఉంటాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 పాఠశాలలకు అందించారు. ఎఫ్.ఎల్.ఎన్ లెర్నింగ్ కిట్లను స్కూల్ కాంప్లెక్స్ ద్వారా మిగిలిన 26391 పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రాథమిక విద్యార్థుల్లో భాషా, గణిత సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఉపయోగ పడతాయి.
ఎఫ్.ఎల్.ఎన్ ప్రింట్ రీచ్ మెటీరియల్ అందించారు లోకేష్. పాఠశాలల్లోని తరగతి గదులను అభ్యసన కేంద్రాలుగా మార్చడంలో ప్రింట్ రీచ్ మెటీరియల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విద్యార్థులు తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా సహజంగా భాషను, అక్షరాలను నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఎఫ్.ఎల్.ఎన్ అమలులో భాగంగా వర్ణమాల, గుణింతాలు, సంఖ్యలు, కీలక పదాల చార్టులు, నిత్యం కొత్త పదాలను ప్రదర్శించే వర్డ్ వాల్, బొమ్మల కథల పుస్తకాలు, ఫ్లాష్ కార్డ్స్ కలిగిన రీడింగ్ కార్నర్స్, తరగతి గదిలోని వస్తువులకు బైలింగువల్ లేబులింగ్, విద్యార్థుల సృజనాత్మకతను చాటే వర్క్ డిస్ ప్లే, బొమ్మలతో కూడిన సూచన బోర్డులను ప్రభుత్వం అందించింది. ఈ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఖాళీ సమయంలో కూడా నిరంతరం నేర్చుకుంటూ, చదువు పట్ల భయాన్ని వీడి పఠనాసక్తిని పెంపొందించుకుంటారు.
















