హైదరాబాద్ : ఒకే ఒక్క సినిమాతో తనేమిటో నిరూపించుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సన. తాజాగా తను టాప్ హీరో రామ్ చరణ్ , జాహ్నవి కపూర్ , శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన పెద్ది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా ఈ సినిమా భారీ అంచనాలు పెంచేలా చేసింది. ఇక రామ్ చరణ్ నటన బాగుందంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా మరోసారి తన సత్తా చాటాడు అల్లా రఖా రెహమాన్. తను పెద్దికి అందించిన పాటలు ఇప్పటికే ఉర్రూతలు ఊగించేలా చేశాయి. బుచ్చిబాబు తనదైన ముద్ర వేశారు మరోసారి పెద్ది మూవీతో. గతంలో తను ఉప్పెన తీశాడు. ఇందులో విజయ్ సేతుపతిని విలన్ గా చూపించాడు. ఇప్పుడు పెద్దిని అన్ని వర్గాలు ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు.
ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా వైరల్ గా మారాడు. తనకు సంబంధించి కటౌట్ కూడా పెట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు గతంలో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశారు, కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక అసాధారణ కారణంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు, స్టార్ కటౌట్‌తో పాటు దర్శకుడి భారీ స్టాండీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇది త్వరగా ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ స్టాండీలో బుచ్చిబాబు రఫ్ అండ్ మస్కిల్డ్ అవతార్‌లో కనిపించడంతో, నెటిజన్ల నుండి ప్రశంసలు , హాస్యభరితమైన స్పందనలు వస్తున్నాయి.
