వెంకీ అనిల్ 5 మూవీపై కీల‌క అప్ డేట్

క‌ళ్యాణ్ రామ్, కృతి శెట్టి జంట‌గా క‌న్ ఫ‌ర్మ్

hellotelugu-AnilRavipudi

హైద‌రాబాద్ : టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌నకు మొద‌ట‌గా లైఫ్ ఇచ్చింది. సినిమాలు చేయ‌మ‌ని ప్రోత్స‌హించింది నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. త‌న‌తో తీసిన ప‌టాస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌తో మూవీ తీశాడు. దానిని ప్ర‌జ‌లు ఆద‌రించారు. అక్క‌డి నుంచి ప్ర‌తీ మూవీని బిగ్ స‌క్సెస్ చేస్తూ వ‌చ్చాడు. కామెడీతో పాటు కంటెంట్ బ‌లంగా ఉండేలా చూస్తూ వ‌చ్చాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తో చేసిన ప్ర‌తి మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ తీశాడు. చాన్నాళ్ల త‌ర్వాత లేడీ సింగం గా పేరు పొందిన విజ‌య‌శాంతిని న‌టింప చేసేలా చేశాడు. ఇది స‌క్సెస్ అయ్యింది. ఇందులో ల‌వ్లీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్ పోషించింది. సంగీత కూడా త‌ళుక్కున మెరిసింది. నంద‌మూరి బాల‌య్య‌తో భ‌గ‌వంత్ కేసరి తీశాడు.

అది హిట్. ఇందులో శ్రీ‌లీల న‌టించింది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ తో తీసిన ఎఫ్ -2 బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ఇదే వెంకీతో సంక్రాంతికి వ‌స్తున్నాం తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ తీశాడు. ఇది రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘వెంకీ అనిల్ 5’ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టి జంటగా నటించబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో ఈ సరికొత్త జోడీ కలయిక సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సంక్రాంతి బరిలో ఈ చిత్రం సందడి చేయనుంది.

Exit mobile version