Dharmendra Pradhan : చెన్నై : కేంద్ర మంత్ర ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తమిళనాడు డీఎంకే సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమిళనాడు పాఠశాలల్లో అనేక భాషలు బోధించబడుతున్నాయని తెలిపారు. ఇందులో తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ ఉన్నాయన్నారు. మరి ఎందుకు హిందీ భాషను వద్దని అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తమిళం, ఇంగ్లీష్ బోధిస్తున్నప్పుడు మూడో భాషతో సమస్య ఎందుకు వస్తుందో చెప్పాలని ఆయన సీఎం ఎంకే స్టాలిన్ ను నిలదీశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు. ఆదివారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. తాము ఎవరిపైనా బలవంతంగా ఏ భాషను రుద్దడం లేదన్నారు.
Union Minister Dharmendra Pradhan Slams DMK Govt
ఎప్పటి నుంచో ఒకటి నుండి 5వ తరగతి వరకు రెండు భాషలు బోధిస్తారని, 6-10 తరగతుల నుండి 3 భాషలు బోధించడం మామూలేనని పేర్కొన్నారు. ఇందులో ఒకటి మాతృ భాషగా ఉండాలి, మిగిలిన రెండు విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు.. భారత ప్రభుత్వం ఏ భాషను బలవంతం చేయడం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇది ఎంత మాత్రం సర్కార్ కు మంచిది కాదని పేర్కొన్నారు.
Also Read : IMD Warning for Rains : 27 వరకు ఏపీలో భారీ వర్షాలు : ఐఎండీ
