చెన్నై : ప్రముఖ నటుడు ధనుష్ కీ రోల్ పోషించిన చిత్రం ఓం. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల నటించారు. ఈ సినిమాకు ఉదయం ఆరు గంటల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది తమిళనాడు టీవీకే సర్కార్. ఈ సందర్బంగా సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు ధనుష్. అంతే కాకుండా తన అభిమానులు సినిమా విడుదలను సురక్షితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ధనుష్ కోరారు. సినిమాను ఆస్వాదించే క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
ఉదయం 6 గంటల ప్రదర్శనలకు లభించిన ఈ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఓం సినిమా విడుదలపై ఉన్న ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభిమానులు ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎక్స్ వేదికగా ధనుష్ ఒక అధికారిక ప్రకటన చేశారు. ఉదయం 6 గంటల ప్రదర్శనలకు హాజరయ్యే అభిమానులు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. ఒక సినిమా విజయం వెనుక ఎంతోమంది కఠిన శ్రమ, అంకితభావం, కృషి ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఈ కృషిని గౌరవించాలని, వేడుకలు సురక్షితంగా, ప్రశాంతంగా ,అందరికీ ఆనందదాయకంగా ఉండేలా చూసుకోవాలని ధనుష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ధనుష్ ఓం సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషించిన ఆకాశంలో ఒక తార మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల విషయంలో ఉదయం పూట ప్రదర్శనలకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అటువంటి సమయంలో ధనుష్ చేసిన ఈ విజ్ఞప్తి, అభిమానులు థియేటర్ నిబంధనలను పాటిస్తూ, తోటి ప్రేక్షకులను గౌరవిస్తూ, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ మద్దతును తెలియ జేయాలని ప్రోత్సహిస్తోంది. వేడుకలు ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించ కూడదని ఆయన గుర్తు చేశారు.

















